![]() |
![]() |

బిగ్‌బాస్ సీజన్ 4తో ముక్కు అవినాష్ దశ తిరిగిపోయింది. అంతకు ముందు జబర్దస్త్ టీమ్ అతన్ని బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైతే షో నుంచి వెలివేస్తామని బెదిరించడంతో అవినాష్ చాలా సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని పరిస్థితిని గమనించిన స్టార్ మా ఏడాది పాటు తమ ఛానల్‌లో కామెడీ షో చేయాల్సిందిగా అతనికి ఆఫర్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంది.
ఆ అగ్రిమెంట్ ప్రకారమే 'కామెడీ స్టార్స్' షోని ఓంకార్ చేత స్టార్ట్ చేయించింది. ఈ షోలో ముక్కు అవినాష్ టీమ్, చమ్మక్ చంద్రతో పాటు మరో టీమ్ కూడా పాల్గొంటూ హాస్యాన్ని పండిస్తోంది. ఇదిలా వుంటే ఈ షోలో భాగంగా గత వారం ముక్కు అవినాష్ భార్యగా, గయ్యాళి వదినగా అరియానా గ్లోరీ కలిసి రచ్చ చేసింది. వచ్చే ఆదివారం అవినాష్ ముగ్గురు ముద్ద గుమ్మలు అషురెడ్డి, జోర్దార్ సుజాత, సిరి హన్మంత్‌లతో కలిసి రచ్చ చేయబోతున్నాడు.

ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రసారం కానున్న ఈ షోలో అవినాష్ ముగ్గురు పెళ్లాలతో తిప్పలు అనే స్కిట్‌ని చేశాడు. ఇందులో అవినాష్ ముగ్గురు భార్యలుగా అషురెడ్డి, జోర్దార్ సుజాత, సిరి హన్మంత్ లు నటిస్తున్నారు.

మొదట విడివిడిగా ఒక్కొక్కరితో ఆడుతూ పాడుతూ హాయిగా కనిపించిన అవినాష్, ఆ తర్వాత ఒక పెళ్లికి ఒక భార్యతో కలిసి వెళ్తే, అక్కడ మిగతా ఇద్దరు భార్యలూ రావడంతో ఎలా బిక్కచచ్చిపోయాడు, వారి నుంచి తప్పించుకోడానికి ఎలాంటి వేషాలు వేశాడనేది చూచాయగా చూపించిన ప్రోమో ప్రస్తుతం నవ్వులు పూయిస్తోంది. ఇక ఫుల్ ఎపిసోడ్ చూస్తే.. ఇంకెన్ని నవ్వులు పండుతాయో!

![]() |
![]() |